`జైల్లో’ ఓ పుస్తకం

జైలుకి పుస్తకాలకు చాలా అవినాభావ సంభందాలున్నాయి. గతంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి వారందరూ వాళ్లను జైల్లో పెట్టినప్పుడు పుస్తకాలు రాసేవారు. అలానే అనుకుని ఫీలయ్యాడో ఏమో కాని.. జైల్లో ఉన్న శ్రీనివాస్‌ కూడా ఓ పుస్తకం రచించాడు. లైఫ్‌ అంటే.. పాపులర్‌ అయిపోవాలి.. నా కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలనుకుంటే జైలుకే వెళ్లాలనుకున్నాడు కాబోలు శ్రీనివాస్‌.

కాగా.. వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు ప్రస్తుతం రిమాండులో ఉన్నాడు. ప్రస్తుతం తను రాసిన పుస్తకం విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం పేర్కొన్నారు. ఈ విషయమై న్యాయమూర్తికి, జైళ్ల శాఖ డీజీకి లేఖలు అందజేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా నిందితుడు శ్రీనివాసరావు గురించి ప్రస్తావిస్తూ, సరైన ఆధారం లేని కేసులో శ్రీనివాసరావుని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికీ జగన్ అభిమానిగానే శ్రీనివాసరావు ఉన్నారని, జగన్ కుటుంబసభ్యుల వద్దకు తీసుకెళ్లి మాట్లాడించి ఈకేసును ముగించాలని చూస్తున్నట్లు సలీం పేర్కొన్నారు.

leave a reply