గో సంరక్షణకు…మరోముందడుగు!

గోవుల సంరక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గోవుల సంరక్షణ కోసం కొన్ని సంరక్షక చర్యలను చేప్పట్టబోతోంది. దీనికోసం ప్రభుత్వం గోవులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది రాష్ట్రంలోని ఎక్సైజ్‌ మరియు ఇతర లాభదాయక కార్పొరేషన్ల నుంచి సెస్‌ విధించడానికి కేబినెట్‌ ఆమోదించింది. దీనికి ‘గో సంరక్షణ సెస్‌’అనే పేరును ఖరారు చేస్తారు. అంతేకాక పట్టణ మరియు గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా ఉండే కొన్ని రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు నిర్మిస్తారు.

ఆర్ధికంగా వెనుకబడ్డ కొంతమంది రైతులు గోవులను రక్షించలేక వాటిని వదిలేస్తున్నారు అని అన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేయబోయే కేంద్రాలలో కొన్ని షెడ్డులను నిర్మింషి, ఒక్కో షెడ్డులో వెయ్యి పశువులకు ఆశ్రయం కల్పించేందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి షెడ్ల వల్ల గోవులకు ఆశ్రయం లభిస్తుందన్నారు. అంతేకాకుండా రోడ్లపై నివసించే కొన్ని పశువులకు కూడా ఆశ్రయం కల్పించినట్లవుతుందని చెప్పారు. వీటికి సంబంధించిన కొన్ని ప్రతేకమైన విభాగాలు పరస్పర సహకారంతో ఆవుల సంరక్షణ చేస్తాయని అధికారులు వెల్లడించారు.

leave a reply