టైటిల్‌ ఏంటబ్బా..!

శర్వానంద్ తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఇక శర్వానంద్‌ తన ఇంకో కొత్త సినిమాతో జీగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ తన తదుపరి సినిమా చేస్తున్నాడు. అయితే.. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ఖరారు కాలేదు.

ఈ సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్‌గా కనిపిస్తాడట.. సో.. ‘దళపతి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ఉన్నారు. అయితే.. ఆ టైటిల్‌ను వేరే నిర్మాత రిజిష్టర్ చేయించుకుని ఉండటం వలన, ప్రస్తుతం ‘నాయకుడు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. కాగా.. ఈ టైటిల్ వలన ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగే ప్రమాదముందనే ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే టైటిల్‌ను ఓకే చేసి, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

leave a reply