‘ఆర్ఆర్ఆర్’ లో ఊహించని ట్విస్ట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తూ దర్శకుడు రాజమౌళి నేతృత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా “ఆర్ఆర్ఆర్” సంబందించిన లీకులు మాత్రం ఆగడం లేదు. ఆర్ఆర్ఆర్ కథ ఇదే అంటూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రం పూర్తిగా స్వాతంత్ర సమరం నేపథ్యంలో తెరక్కుతోందని.. ఎన్టీఆర్ బందిపోటుగా, రాంచరణ్ పోలీసుగా కనిపిస్తాడని అంటున్నారు.

తాజాగా ఈ చిత్ర కథ గురించి మరో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర కథలో రాజమౌళి ఊహించని విధంగా మెలిక పెట్టబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జనవరిలో ప్రారంభంకానుంది.

మరోవైపు, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే యోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. రెండు భాగాలుగా సినిమా తీస్తే… నిర్మాతలకు సేఫ్ ఉంటుందని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది.

విలన్ రోల్ ను రానా చేస్తున్నాడనే ప్రచారం జరగుతుండగా, కేజీఎఫ్ తో ఒక్క సారిగా తెలగులో క్రేజ్‌ పెరిగిన కన్నడ స్టార్ హీరో యష్ ను విలన్ గా తీసుకున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే, అధికారికంగా మాత్రం ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఈ చిత్రంలో విలన్ ఎవరో… లేదా ఇద్దరు విలన్లు ఉంటారా..? అనే విషయం తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

leave a reply