కేజిఎఫ్..ఎలా ఉందంటే !

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంచుకున్నపాయింట్ బాగున్నా దాని తెరమీద అంతే ఇంటెన్సిటీతో చూపడంలో పూర్తిగా సక్సెస్కాలేకపోయాడు. ఇలాంటి కథలకు కావాల్సిన డెప్త్ ఎమోషన్ ని ప్రేక్షకుల మనస్సులోరిజిస్టర్ చేయడంలో సగం మార్కులే తెచ్చుకోవడంతో కేజిఎఫ్ ని భారీతనం ఉన్న ఓ సగటు సినిమాగా మిగిల్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రాకీ పాత్రను బిల్డప్ చేయడానికి టైం తీసుకున్నప్రశాంత్ దానికి తగ్గట్టు కట్టిపడేసే ఎపిసోడ్స్ ఓ రెండు మూడు రాసుకున్నా దీనిరేంజ్ ఎక్కడికో వెళ్ళేది. రాకీ ప్రేమలో పడటం తలాతోకా లేకుండా సాగితే అతను  చాలా సులభంగా ఓ ఫైట్ చేసేసి కోలార్ ఫీల్డ్స్లోకి హీరో లెవెల్ లో ఎంటరైపోవడం నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయనినిపించదంటే దానికి స్క్రీన్ ప్లే లోపమే కారణంపూర్తిగా సంతృప్తిపరచలేకపోయాడు. అయినప్పటికీ అతనిలో ఉన్నటెక్నీషియన్ కన్నడ సినిమా స్థాయి పెరిగింది అని చెప్పడానికి మాత్రం బాగాఉపయోగపడింది. రవి బస్నూర్-తనిష్క్ ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని బాగాక్యారీ చేసింది కాని పాటలు కనీస స్థాయిలో కూడా లేవు. ఏదో రొదలా అనిపిస్తాయి తప్పఇంకే విశేషమూ లేదు. తమన్నా సాంగ్ వృధా అయిపోయింది.

ఇక ప్రత్యేకంగాచెప్పుకోవాల్సింది భువన గౌడ ఛాయాగ్రహణం గురించి. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్హాఫ్ ని ఊహల్లో మాత్రమే చూడడానికి సాధ్యమయ్యే కోలార్ బంగారు గనుల నేపధ్యాన్నిరెండు విభిన్నమైన కలర్ స్కీంస్ లో చూపించిన తీరు టాప్ స్టాండర్డ్ లో ఉంది. తనకువంక పెట్టే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. అందరి కంటే ఎక్కువ ప్రశంశలకు అర్హుడు ఆర్ట్డైరెక్టర్ శివకుమార్. కోలార్ సెటప్ ని తీర్చిదిద్దిన తీరు అవార్డులు తెచ్చిపెట్టినా ఆశ్చర్యం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ సహకారం తీసుకున్నా చాలా సహజంగాఅనిపించేలా ఆనాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు పునఃసృష్టి చేసిన తీరుఅభినందనీయం. శ్రీకాంత్ ఎడిటింగ్ ఇంకొంచెం పదునుగా ఉంటె అవసరం లేని చైల్డ్ఎపిసోడ్స్ కు కోత పడి ఇంకా క్రిస్పి గా మారేది. ఒరిజినల్ నిర్మాత హోంబాలే నిర్మాణవిలువలు భారీగా ఉన్నాయి. వారాహి వారు బహుశా ఇది చూసే ఈ రేంజ్ లో విడుదల చేసేందుకుముందుకు వచ్చుంటారు.

కేజిఎఫ్ చాప్టర్వన్ ఒక విభిన్నమైన అనుభూతిని కలిగించే గ్యాంగ్ స్టర్ మూవీ. ఇంతవరకు తెరపై బంగారుగనుల నేపధ్యంలో సినిమా రాలేదు కానీ ఇలాంటి మాఫియా కథలతో చాలా వచ్చాయి. ఆరకంగాచూసుకుంటే కేజిఎఫ్ ఒక సగటు సినిమాలాగే అనిపిస్తుంది.విజువల్ గా హై స్టాండర్డ్ లోతీర్చిదిద్దినా కంటెంట్ లో అంత డెప్త్ లేకపోవడంతో పాటు ఇది అసంపూర్తిగా ముగిసేమొదటి భాగం కాబట్టి బాహుబలి తరహాలో రెండో పార్ట్ కోసం ఉత్సుకతతో ఎదురు చేసే ఛాన్స్ఇవ్వలేకపోయింది. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుంటే తప్ప కేజిఎఫ్ పూర్తిగా మెప్పించడం కష్టం.

రేటింగ్ : 2.0 / 5

leave a reply