తలలో దురదగా ఉందా!

చుండ్రు లేకపోయినా తల దురదగా ఉంటుంది. అందుకు కారణం వెంట్రుకలు పొడిబారడమే, ఈ సమస్య నుంచి బయట పాడటానికి  ప్రొబయోటిక్స్‌ ఉన్న ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పెరుగు, ఉల్లిపాయలు, గోధుమలు, బంగాళాదుంపలు వంటివి ఆహారంగా ఎక్కువగా తీసుకోవాలి. దీంతో రోగనిరోధకశక్తి మెరుగుపడటమే కాక,  ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటి వాటి నుంచి బయటపడవచ్చు.

అంతేకాక ఒత్తిడి గురి కావడం వల్ల జుట్టు రాలిపోవడం, తల పొడిబారడం జరుగుతుంది. తరచూ తలస్నానం చేసే వారిలోనూ ఈ సమస్య కనబడుతుంది. ఇందుకోసం గాఢత తక్కువ ఉన్న షాంపూలను వాడాలి. వాటిలో పీహెచ్‌ స్థాయులు తక్కువ ఉండడంతో ఇలాంటి సమస్యలు తలెత్తవు.

దురద ఎక్కువగా ఉన్నవారు తలకు ఎక్కువగా నూనెను రాయడం చేస్తే సరి. రోజంతా నూనె పెట్టుకుని ఉండటం ఇబ్బంది అయితే కనీసం రాత్రిపూట లేదంటే, తలస్నానానికి రెండు గంటల ముందు నూనె రాసుకోవాలి.

కొన్నిసార్లు డీహైడ్రేషన్‌ వల్ల దురద రావడం జరుగుతుంది. అందుకోసం నీళ్లు ఎక్కువగా తాగాలి, అలానే పండ్లు, కూరగాయల రసాలు కూడా తీసుకుంటే మంచిది. దురద సమస్యతో బాధపడుతున్న వారు వేడిని అందించే డ్రయ్యర్లు, స్ట్రెయిట్‌నర్లకు దూరంగా ఉండాలి. వీటిని వాడటం వల్ల తేమ పోయి పొడిబారుతుంది. దాంతో దురద, అక్కడి చర్మం చిట్లిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

leave a reply