కోహ్లీని అందుకోవడం కష్టమే:సంగక్కర!

ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్‌కోహ్లీ ఎవరికీ అందని స్థాయిలో ఉన్నాడని శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర పేర్కొన్నాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంగక్కర, జయవర్ధనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంగక్కర మాట్లాడుతూ.. “విరాట్‌ కోహ్లీ గురించి ఎంత మాట్లాడిన తక్కువే. ఇప్పుడున్న క్రికెటర్లందరిలో విరాట్‌ అద్భుత ఫామ్ లో ఉన్నాడు అతనిని అందుకోవడం చాలా కష్టం, భవిష్యత్‌లో కూడా అతను తన ఫామ్ కొనసాగించాలని ఆశిస్తున్నాడన్నాడు.

అయతే ఇంతకముందు వరకూ ఏబీ డివిలియర్స్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌తో పాటు విరాట్‌కోహ్లీ అదే స్థాయిలో ఆడేవారు. కానీ స్మిత్‌ బాల్ టాంపరింగ్ వల్ల ఆటకు దూరం కాగా, డివిలియర్స్‌ రిటైరయ్యారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ పర్యటనల్లో విరాట్‌ అదరగొడుతున్నాడు. పరుగులు రాబట్టడంలో కోహ్లీ తరవాతే ఎవరైనా, అతడి బ్యాటింగ్‌ వ్యవహారశైలీ కూడా మెరుగుపడింది అని సంగక్కర తెలిపాడు.

ఆ తరువాత శ్రీలంక మాజి క్రికెటర్ జయవర్ధనే మాట్లాడుతూ.. ఇంతముందు టీమిండియా అంటే సచిన్‌ టెండుల్కర్‌ గుర్తొచ్చేవారు, ఇప్పుడు కోహ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. సచిన్‌ ఎలా అయితే ఒత్తిడి జయించి ఆడతాడో అలాగే విరాట్‌ కూడా ఒత్తిడిని జయించడంలో మంచి నైపుణ్యం ఉన్న బ్యాట్స్ మెన్ అని కొనియాడాడు. అతడికి మంచి ఆటగాళ్లు దొరికారు. అటు బ్యాట్సమెన్‌గా విజయం సాధిస్తూ ఇటు కెప్టెన్‌గాను విజయవంతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు.

leave a reply