బ్లూబెర్రీస్‌తో వీటికి చెక్‌..

Women picking ripe blueberries close up shoot

బ్లూబెర్రీల‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి శ‌రీర క‌ణ‌జాలాన్ని నాశ‌నం కాకుండా ర‌క్షిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారిన ప‌డ‌కుండా చూసుకుంటాయి. క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. బ్లూ బెర్రీల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. వీటిలో విట‌మిన్ బి, సి, ఇ ల‌తోపాటు విట‌మిన్ కె పుష్క‌లంగా ఉంటుంది. ఇవ‌న్నీ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. బ్లూ బెర్రీల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు త‌గ్గుతుంది. డిప్రెష‌న్ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.  ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బ్లూబెర్రీలు త‌గ్గిస్తాయి. గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకుంటాయి. బ్లూబెర్రీలు మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి. మెదడును చురుగ్గా ఉండేలా చేస్తాయి.

నిత్యం బ్లూబెర్రీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వృద్ధాప్యంలో మ‌తిమ‌రుపు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు బ్లూబెర్రీల‌ను తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే యాంటీ డ‌యాబెటిక్ ఎఫెక్ట్స్ ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. శ‌రీరం ఇన్సులిన్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించేలా చేస్తాయి. దీంతో టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారు బ్లూ బెర్రీల‌ను తింటే మంచిది. ఇక వ్యాయామం చేసేవారు బ్లూబెర్రీల‌ను తింటే కండ‌రాలు త్వ‌ర‌గా నిర్మాణ‌మ‌వుతాయి.

వీటిని జ్యూసెస్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌, ఐస్‌ క్రీమ్స్‌, పిజ్జాస్‌లో మనకి నచ్చే విధంగా ఎలా తయారు చేసుకున్నా మనకు కావాల్ని ప్రోటీన్‌ను అందుతాయి.

leave a reply