తెలంగాణ క్యాబినెట్… పెరిగిపోయిన ఆశావాహులు..!

తెలంగాణ క్యాబినెట్ కూర్పు ఏప్పుడా అని ఆశావాహులు ఎంతో ఆశతో ఏదురుచూస్తున్నారు… అసలు తెలంగాణ క్యాబినెట్ కూర్పు ఎందుకు ఆలస్యమవుతుంది. ముహూర్తం కోసమే కేసీఆర్  క్యాబినెట్ ను విస్తరించడంలేదా…. ఈ నెల 27 లేదా 30 న క్యాబినెట్ కూర్పుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా.. కేసీఆర్ ఆశిస్సులు ఏవరెవరికి ఉన్నాయి.. మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఏవరు… మంత్రి పదవులు దక్కే నేతలెవరు… అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

టిఆర్ఏస్ ప్రభుత్వం పక్షం రోజులు గడుస్తున్నా ఒక్క హోంమంత్రి మినహా మిగతా మంత్రిత్వ శాఖలన్ని కాలీ కూర్చీలతో బోసిపోతున్నాయి. ప్రభుత్వం ఉన్నా అధికారులతోనే అన్ని పనులు జరుగుతున్నాయి. గతంలో మంత్రులుగా పనిచేసిన నేతలు ఈ ఏన్నికల్లో ఓడిపోవడంతో కొత్త వారికి ఈ సారి మంత్రి పదవులు దక్కే అవకాశం కనబడుతోంది. ఇక పాత మంత్రి వర్గంలో  కొంతమందిని కేసీఆర్ ఈసారి క్యాబినెట్ లో కి తీసుకోరనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారు ఏవరనేది మాత్రం తెలియక అందరిలో ఆసక్తి ని పెంచుతుంది.

 ఈ అంశం ఇక ఈసారి ఏంపీ నుంచి ఎమ్మెల్యేగా ఏన్నికైనా వారు ఉండటంతో మంత్రి పదవులకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలందరు ఏదో విధంగా కేసీఆర్ మదిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారట. గత ప్రభుత్వం లో మంత్రి పదవులు మిస్సయిన నేతలు ఈ సారి తనకే మంత్రి పదవి వస్తుందని జిల్లాల్లో సదరు నేతలు చెప్పకుంటుంన్నారని సమాచారం.

జిల్లాల వారిగా చూస్తే మహాబూబ్ నగర్ జిల్లా నుంచి గతంలో వెలమ సమాజిక వర్గం నుంచి మంత్రి పదవి లో ఉన్న జూపల్లి కృష్ణారావుఈసారి  ఓటమి పాలవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఏర్రబెళ్ళి దయాకర్ రావు పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లను మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతుంది. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్, వరంగల్ జిల్లా నుంచి  దాస్యం వినయ్ భాస్కర్ ,రెడ్యా నాయక్ ,పెద్ది సుదర్శన్ రెడ్డి,కడియం శ్రీహరి, నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, గొంగడి సునీత పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే పట్నం నరెందర్ రెడ్డి, వివేకానంద, మంచి రెడ్డి కిషన్ రెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్, కేటీఆర్, గంగుల కమలాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పోటీ లో ఉన్నారు. మెదక్ నుంచి పద్మా దేవెందర్ రెడ్డి, హరీష్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ లో మహిళా కేటగిరిలో రేఖానాయక్, మాజీ మంత్రి జోగురామన్న పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, దానం నాగెందర్ పేర్లు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. మంత్రులు  లేకుండానే అధికారులతో  వివిధ శాఖల రివ్యూ లు నిర్ణయాలు చకచకా  జరిగిపొతున్నాయి. దీంతో ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మంత్రులు లేరనే భావన కలగకుండా చూసుకుంటున్నారు కేసీఆర్. అయితే, కేవలం మంచిరోజులు లేకపోవడంతోనే  క్యాబినెట్‌ను విస్తరించడం లేదని సీఎం కేసీఆర్ సన్నిహితులు చెపుతున్నారు. ఈ నెల 27,30 తేదీలలో మంచి రోజులు ఉన్నాయని పురోహితులు చెపుతున్నారు. దీంతో అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెల 27 లేదా 30 న క్యాబినెట్ ను విస్తరించే అవకాశం ఉందని తెలంగాణ భవన్ వర్గాలు భావిస్తున్నాయి.

leave a reply