ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు…

బుధవారం ఉదయం కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయా అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది.అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను కూడా ప్రకటించింది. కౌలు రైతులూ కూడా ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది.డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు,సిమ్ కార్డుతో పాటు మూడేళ్ల కనెక్టివిటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.పంచాయతీ కంటిజెన్సీ ఉద్యోగులకు జీతాలు పెంపు,అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయింపు, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ తీర్మానించారు.అలాగే ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ… చదరవు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది.అలాగే జిల్లా ఆస్పత్రుల స్థాయి పెంపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

leave a reply