దంతాల…ఆరోగ్యం!

woman near lake laughing

చిరునవ్వు అందంగా కనపడాలంటే ఆరోగ్యకరమైన దంతాలు చాల అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటే  మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యరంగా ఉండే దంతాల వలన చిరునవ్వుతో పాటూ సహచరులతో కూడా బాగా మాట్లాడగలరు. మన శరీరంలో అన్ని భాగాల గురించి ఎలా జాగ్రత్త తీసుకుంటారో  అలాగే దంతాలపట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా దంతాల పట్ల జాగ్రత్త వహించటం వలన దంతాలు ఊడిపోవటం, చిగుళ్ళులో నిప్పి రక్తం రావడం మరియు ఇతర సమస్యలకు దూరంగా ఉంటారు.

తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దంతాలపై పేరుకుపోవడం జరుగుతుంది. ఇలా పేరుకుపోవటం చాలా ప్రమాదకరం మరియు పంటి పై పొర అయినట్టి ఎనామిల్ కూడా ప్రమాదానికి గురి అవుతుంది. చక్కెర పదార్థాలు తిన్నపుడు, చక్కెర అణువులు వెంటనే తొలగిపోవటానికి వెంటనే నీటితో పుకిలించి ఉంచండి. దీని ఒక అలవాటుగా మార్చుకోవటం వలన నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.అంతే కాకుండా ప్రతిరోజు నిద్రపోయే ముందు పుక్కిలించడం వల్ల దంతాలు శుభ్రపడతాయి.

ముఖ్యంగా నోటిలో నాలుక చాలా ముఖ్యమైనది మరియు నోటిని  ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. నాలుక రుచి మరియు శ్వాసకు సహాయపడటమే కాకుండా, దంతాలపై మచ్చలు, పొలుసులు ఏర్పడకుండా చూస్తుంది కావున నాలుకను కూడా శుభ్రంగా ఉంచుకుంటే దాదాపు దంత సమస్యలు దరిచేరవు.

leave a reply