‘త్రిష’ పాత్రను మరొకరు చేయకూడదు

తమిళలో సూపర్‌ హిట్‌ అయిన ‘96’ విమర్శల ప్రసంశలతోపాటు సినీ ప్రముఖుల మెప్పు పొందింది. ఈ సినిమాలో త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించారు. గత ఏడాది అక్టోబరులో విడుదలైంది. కాగా.. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సొంతం చేసుకున్నారు. ఇన్నాళ్లూ సరైన నటుల కోసం చూసిన యూనిట్‌ శర్వా, సమంతను ఎంచుకుంది. సమంత ఇందులో నటించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆమె ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘త్రిష పాత్రను మరొకరు చేయకూడదు’ అని చెప్పారు. ఆగస్టులో తెలుగు రీమేక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

తమిళ హిట్‌ ‘96’ సినిమా తెలుగు రీమేక్‌లో శర్వానంద్‌, సమంత జంటగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. తమ ప్రొడక్షన్‌లో వస్తోన్న 34వ చిత్రం ఇది అని తెలిపింది. చిత్రానికి సి.ప్రేమ్‌ కుమార్‌ డైరెక్షన్‌ వహించనున్నట్లు పేర్కొంది. కాగా.. మార్చిలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

leave a reply