స్టంపింగ్‌లో ధోనికి…సాటెవరు!

టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రెండో వన్డేలో మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని మరోసారి తన అద్భుతమైన స్టంపింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మౌంట్‌ మాంగనీలో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్ టేలర్‌ వికెట్ స్టంపింగ్‌తో తీసి తానేంటో నిరూపించుకున్నాడు. 18వ ఓవర్‌ వేసిన జాదవ్‌ .. తొలిబంతిని కాస్త తక్కువ వేగంతో విసరడంతో కివీ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ కొంచం క్రీజ్లో నుంచి బయటకు రావడంతో, ఆ బంతి నేరుగా వెళ్లి ధోని చేతిలో చేరడంతో సెకన్లలో ధోని స్టంపింగ్‌ చేసాడు. దాంతో టేలర్‌ను ఔట్‌ చేయడం ద్వారా మహి ఖాతాలో 119వ స్టంపింగ్‌ చేరింది.

337 వన్డేలాడిన ధోని 311 క్యాచ్‌ ఔట్లు, 119 స్టంపింగ్‌లు చేసిన ఘనత సాధించాడు. అంతేకాకుండా అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు (520) ఆడిన వికెట్‌ కీపర్‌ ధోని అవడం మరో విశేషం. కాగా, వికెట్ కీపింగ్లో ధోనికి ఎవరు సతి లేరని.. భారత నెంబర్ వన్ జోడిగా ధోని-జాదవ్ నిలిచారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 48 (33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌) పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారీ స్కోరు (324) సాధించడంలో ముఖ్య పాత్ర వహించాడు.

leave a reply