కళ్యాణ్ రామ్..’118’టీజర్!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్నమూవీ ‘118’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్లో సినిమా స్టొరీని పెద్దగా రివీల్ చేయలేదు కానీ.. థ్రిల్లర్ స్టొరీ అనే విషయాన్నీ మాత్రం హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేద థామస్.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే నటిస్తున్నారు.ఈ సినిమాకి డైరెక్టర్ గా  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవీ గుహన్ పనిచేస్తున్నారు. కళ్యాణ్ రామ్ – షాలినిల జీవితంలో ఒకరోజు అనుకోని సంఘటన జరుగుతుంది. షాలినిగాయలపాలవడం.. కళ్యాణ్ రామ్ టెన్షన్ లోఉండడం.. ఏదో మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో ఉన్నట్టు గా చూపించారు. కళ్యాణ్రామ్ కు తోడుగా ప్రభాస్శీను కూడా కనిపించాడు. అయితేట్రైలర్లో ఎక్కడా నివేదా థామస్ ను చూపించకపోవడంగమనార్హం. సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా రిచ్ గాఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ట్రైలర్ సినిమాఫై అంచనాలు పెంచే విధంగా ఉంది.

leave a reply