నన్ను చంపడానకి చూస్తున్నారు.. మోదీ ఒత్తిడితోనే..!

ఆర్కేనగర్‌ తరహాలో కొడంగల్‌‌లో కూడా ఎన్నిక వాయిదా వేయించడానికే

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తమిళనాడులోని ఆర్కేనగర్‌ తరహాలో కొడంగల్‌‌లో కూడా ఎన్నిక వాయిదా వేయించడానికి టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని చెప్పారు. కేంద్ర భద్రత సిబ్బందితో తనకు సెక్యూరిటీ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అన్ని రకాలుగా ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. కొడంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన బంధువుల ఇళ్లల్లో రూ.17.51 కోట్లు దొరికాయని, కానీ కేవలం రూ.50 లక్షలే దొరికాయంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆ సోదాల్లో ఒక కీలక డైరీ కూడా దొరికినా దానిని గోప్యంగా ఉంచారన్నారు. కేసును నీరుగార్చేలా ఐటీ అధికారులపై టీఆర్ఎస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు.

24 గంటల్లో నిజానిజాలు బయటకు తెలిస్తే టీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవనే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, ప్రధాని మోదీ ఒత్తిడితో ఎన్నికల అధికారి గోప్యత పాటిస్తున్నారని ఆరోపించారు.

leave a reply