నిబంధనను ఉల్లఘించాడు.. రాజీనామా చేయల్సి వచ్చింది..!

ఎన్నికల సమయాన తప్పుడు పత్రాలు అందించి ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ నవంబర్ లో హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. అసలు ఈరన్న రాజీనామాకు సంబంధించిన వివరాలు ఏంటంటే…

అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా ఈరన్న 2014 లో టిడిపి తరపున ఎన్నికయ్యారు. వైసిపి నుంచి పోటి చేసిన తిప్పే స్వామి పై ఈరన్న గెలుపొందారు. ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని పొందు పరిచారని దాని పై విచారణ చేయాలని తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరన్న పై కర్ణాటకలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వాటిని ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చూయించలేదని తిప్పే స్వామి పిటిషన్ లో పేర్కొన్నారు. 

పిటిషన్ నువిచారణకు స్వీకరించిన కోర్టు ఎన్నికల నిబంధనను ఉల్లఘించడం పై విచారణ చేసింది. విచారణలో ఈరన్న తన పై  ఉన్న కేసుల వివరాలు వెల్లడించలేదని తేలింది. ఈరన్న ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్టుగా తేల్చింది. ఈనేపథ్యంలో ఈరన్న ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఎన్నికలు జరిగేవరకు వైసిపి అభ్యర్ధి డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా వ్యవహరించాలని కోర్టుఆదేశించింది.

కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో వీరన్న తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు . ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వీరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు.. తదుపరి ఎన్నికలు జరిగేవరకు డాక్టర్‌ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు ఇచ్చింది.

ఈరన్నకికర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంది. ఈ విషయాన్ని కూడా ఈరన్న అఫిడవిట్లో పేర్కొనలేదు. వీటన్నింటిని పరిశీలించిన కోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో ఈరన్న శుక్రవారం మద్యాహ్నం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అమరావతిలో అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.ఈరన్న రాజనామాతో తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.

leave a reply