నేరగాళ్ల ఆటలు…ఇక చెల్లవు

మొబైల్ డేటా భద్రత విషయంగా ఆండ్రాయిడ్‌ యాప్‌లకు వేదికైన ప్లేస్టోర్‌ నుంచి 85 యాప్‌లను గూగుల్‌ తొలగించింది. టీవీ రిమోట్‌ కంట్రోల్‌, గేమ్స్‌ వంటి యాప్‌ల పేర్లతో కొంతమంది నేరగాళ్లు ప్లేస్టోర్‌లో పెట్టారు. పైకి ఉపయోగకరమైన యప్‌ల్లా కనిపిస్తూనే, ఇవి స్మార్ట్‌ఫోన్‌ను అదుపులోకి తీసుకుని దుర్వినియోగం పాలవుతుందని సంస్థ పేర్కొంది. ఈ యాప్ ల వల్ల ఎక్కువ భాగం యాడ్స్ కి తప్ప ఏమి ఉపయోగం లేకుండా వినియోగదారులకి నష్టం కలుగుతుందని తెలిపింది.

వాట్సాప్‌ చాట్ లు ఇప్పుడు మరింత సురక్షితం కానున్నాయి. ఇందుకోసం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఫింగర్‌ప్రింట్ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. బాలల అశ్లీల చిత్రాలను పంచుకున్నందుకు తమ యాప్‌లోని 1.3 లక్షల ఖాతాలను వాట్సాప్‌ తొలగించింది. భారత్‌తోపాటు వివిధ దేశాల్లోని భద్రత కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసిన అభ్యర్థనల మేరకు, ఎన్‌క్రిప్షన్‌ విధానంతో  వాట్సాప్‌ సందేశాల్లో ఏముందో గుర్తించడం మూడో వ్యక్తికి వీలుపడదు.  ఐవోఎస్‌లో ఫేస్‌ ఐడీ, టచ్‌ ఐడీ మీద పనిచేసిన తరవాత ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టింది.

ఒకసారి దాన్ని ఎనేబుల్ చేస్తే, ఈ ఛాట్ యాప్‌ పూర్తి సురక్షితంగా మారనుంది. ఒక నిర్దిష్ట సంభాషణకు మాత్రమే కాకుండా మొత్తం యాప్‌ ఇతరులు వినియోగించడానికి వీలులేకుండా లాక్‌ అవుతుందని బీటాఇన్ఫోతెలిపింది. భవిష్యత్‌లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుందని తెలిపింది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది.

leave a reply