అలా చేయివేయడంపై.. ఏమన్నారంటే

కాజల్ అగర్వాల్ తొలిసారి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్యారిస్ ప్యారిస్ వివాదాస్పదంగా మారడంపై కాజల్ స్పందించక పోయినా.. ఆ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ స్పందించాడు. హిందీ బ్లాక్ బస్టర్ మూవీ క్వీన్ చిత్రానికి రిమేక్ గా తెరకెక్కుతోంది. క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ నటించగా.. ఆమె పాత్రకు ప్రశంసలు లభించాయి.

అయితే.. కాజల్ అగర్వాల్ తన ఊరి నుంచి ప్యారిస్ కు ఒంటరిగా హానీ మూన్ కు వెళ్లే యువతిగా నటిస్తోంది. చాలా చిత్రాల్లో కాజల్ గ్లామర్ పాత్రలు చేసింది. కానీ ఈ చిత్రం పూర్తిగా నటనపై ఆధారపడి ఉండే చిత్రం. ఇటీవల విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ అందులో ఓ సన్నివేశం మాత్రం తీవ్ర వివాదంగా మారింది.

టీజర్ లో చూపిన విధంగా కాజల్ అగర్వాల్ పక్కనే ఉన్న యువతీ ఆమె ప్రైవేట్ భాగాలపై చేయి వేస్తుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాజల్ పై విమర్శలు చెలరేగాయి. కాజల్ ఎంతగా అందాలు ఆరబోసినా ఎప్పుడూ హద్దులు దాటలేదు.. వల్గర్ గా నటించలేదు. కానీ ఈ సన్నివేశం చూసాక కాజల్ అభిమానులే ఫీల్ అవుతున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. టీజర్ మాత్రమే చూసి కేవలం టీజర్ మాత్రమే చూసి సినిమాపై విమర్శలు చేయడం సరికాదు అంటూ దర్శకుడు ఆ సన్నివేశాన్ని సమర్థించుకున్నారు. సినిమాలో అంతకు ముందు వచ్చే సన్నివేశం చూస్తే ఆ సీన్ ఎందుకు పెట్టామో మీకు అర్థం అవుతుంది. ఇలాంటి సన్నివేశం హిందీ క్వీన్ లో కూడా ఉంది. ఆ చిత్రం జాతీయ అవార్డు సొంతం చేసుకుందని తెలిపారు.

leave a reply