సుకుమార్ తో సినిమా చేయడంలేదు: మహేష్ బాబు

మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రం సుకుమార్‌తో ఉంటుందని తెలిపాడు.అయితే మహాశివరాత్రి సందర్భంగా సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేయబోతున్నట్లుగా ప్రకటించారు.దింతో ఈ సినిమా మీద నీలినీడలు కమ్ముకున్నాయి. కొన్ని సృజనాత్మక అంశాల్లో విభేదాలు రావడంతో సుకుమార్ తో సినిమా చేయడంలేదంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఈ సందర్భంలో, సుకుమార్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు మహేష్ బాబు. కొత్త ప్రాజక్ట్ ప్రకటించిన సుకుమార్ కు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఓ ఫిల్మ్ మేకర్‌గా ఆయనంటే , నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఆయనతో చేసిన ‘1 నేనొక్కడినే’ చిత్రం నాకెప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోతుంది అని తెలిపారు.

leave a reply