అనుష్క రేంజ్‌.. హాలీవుడ్‌..!

బాహుబ‌లి సినిమాలో దేవ‌సేన‌గా తనదైన నటనతో కనిపించిన అనుష్క.. ఆ త‌ర్వాత భాగ‌మ‌తి చిత్రంతో ప్రేక్షకుల మతి పోగొట్టిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి చిత్రంతో అనుష్క పేరు ఖండాంత‌రాలు దాటింది. ఆమె సినిమాలో న‌టించేందుకు ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టులు కూడా స‌న్న‌ద్ధంగా ఉన్నార‌నేది తాజా స‌మాచారం.

వివరాల‌లోకి వెళితే.. భాగ‌మ‌తి అనే థ్రిల్ల‌ర్ సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క త్వ‌ర‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయ‌నుంది. కోన వెంక‌ట్ నిర్మించ‌నున్న ఈ చిత్రం థ్రిల్ల‌ర్ మూవీగా ఉంటుంద‌ట‌. మూవీ చిత్రీక‌ర‌ణ ఎక్కువ శాతం అమెరికాలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. అయితే.. బాహుబ‌లి చిత్రంలో న‌టించిన అనుష్క త‌మ‌తో చిత్రం చేస్తుంద‌ని చెప్ప‌గానే హాలీవుడ్ న‌టులు మా సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు అని కోన వెంక‌ట్ ఓ ఆంగ్ల ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. మాధ‌వ‌న్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు అని అంటున్నారు. తెలుగు త‌మిళ భాష‌ల‌లో చిత్రాన్ని రూపొందించేందుకు కోన వెంక‌ట్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తుంది.

leave a reply