వంగవీటి రాధా..దారెటు?

వంగవీటి రాధా వై.సి.పి దూరమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. వై.సి.పిలో తన స్థానం గురించి మరోమారు చర్చనీయాంశమైంది. బుధవారం నగరంలో పలు ప్రాంతాల్లో రాధా తండ్రి వంగవీటి మోహనరంగా 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాధా పాల్గొనడం జరిగింది  కానీ ఎక్కడా వైసీపీకి సంబంధించిన జెండాలు కనిపించలేదు. అంతేకాక పార్టీ  నాయకులు కూడా ఎవ్వరూ ఆయనతో కలిసి తిరిగిన దాఖలాలు లేవు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు, మరో వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు కలిసి వన్‌టౌన్‌లో కొన్ని చోట్ల రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

త్వరలోనే ఆయన పార్టీ మారడంపై ప్రకటన చేస్తారని సమాచారం. విజయవాడ సెంట్రల్‌ సీటు నుంచి 2004లో కాంగ్రెస్‌ తరఫున రాధా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తరువాత అదే స్థానం నుంచి 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసిన అయన  ఓడిపోయారు. 2014లో విజయవాడ తూర్పు నుంచి వైసీసీ తరఫున పోటీ చేసి మరల ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేయాలన్న తనకు వైసీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది . ఇటీవలే మల్లాది విష్ణును తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. మరోవైపు విజయవాడ తూర్పులో యలమంచిలి రవి తన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కారణాలతో  వై.సి.పిని  వీడి జనసేన కానీ టీడీపీలో కానీ చేరాలన్నఆలోచనలో రాధా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై బుధవారమే రాధా ఓ నిర్ణయం ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే రాధా తన సన్నిహితులతో మరోమారు చర్చించి పార్టీ మారాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

leave a reply