పేదల కోసమే ఆదరణ

కుల వృత్తులవారితో పాటు అందరూ గౌరవప్రదమైన ఉపాధి పొందేందుకే ఆదరణ వంటి పధకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రంలో మూడవ దఫ అద ర 29 వధకాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో మొదటి విడత ఆదరణ పధకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రెండవ విడత తిరుపతిలో పరాటు చేస్తామని, మూడవది అనకాపల్లిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రపంచీకరణ, ఆధునీకరణ నూతన టెక్నాలజీ వంటి వాటిని చేర్చి కులవృత్తుల వారు అంది పుచ్చుకోవాలని ఆదరణ ద్వారా అవసరమైన పనిముట్లను ఎక్కువ సడీతో లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. చేత, కుల వృత్తులు కనుమరుగవుతున్న తరుణంలో ఆదరణ వధకం వారికి ఎంతగానో అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తర్వాత అందరూ రాష్ట్ర అభివృద్ధి పై భవిష్యత్ పై భయపడటం జరిగిందన్నారు. అప్పటిలో నేను అండగా ఉంటానని పెద్ద కుమారిడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జరిగిందని చెప్పారు.

హక్కుల కోసం పోరాటం చేస్తూనే అందరికి అందంగా ఉంటున్నానని, అర్హులైన వారందరికి 1000 రూపాయలు ఫించను ఇవ్వడంతో పాటు, చంద్రన్న భీమా వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా అమలు కాని, అనేక సంక్షేమ పధకాలు ఇక్కడ అమలు జరుగుతున్నాయన్నారు. 80 లక్షల ఇల్లులు మంజూరు చేసిన ఘనత తెలుగుదేశ ప్రభుత్వానిదే అన్నారు. 53వేల కోట్లు ఇందుకు ఖర్చుచేయడం జరిగిందన్నారు. 2022 నాటికి ఇల్లులేని పేదలు రాష్ట్రంలో ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాబోయే జన్మభూమిలో సంక్షేమ పథకాలు అమలు కాని వారు అర్హులైన వారు అందరూ ధరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అందరి కలలో వెలుగు ఆనందం చూడాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికబద్దంగ పనిచేస్తున్నామని, అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామన్నారు. పనిచేయడమే నా ఐలహీనతని చెప్పారు. నన్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆర్థిక అసమానత లేని సమాజం కోసం పనిచేస్తున్నానన్నారు. ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజల కోసం రాజీలేని తన పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు.

అనకాపల్లి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వరాల విజల్లు కురిపించారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ, పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాసరావు కోరిన కోర్కెలకు ఆయన అమోద ముద్ర వేశారు. తుమ్మపాల ఆనకట్టకు 24 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని, దీనిద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రకటించారు. గోదావరి నీరు విశాఖకు కుడికాలువద్వారా అందించే బాధ్యత నాదని దీని ద్వారా సాగునీరు, లభిస్తుందని, చెప్పారు.

వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని మరింత ఆధునీకరిస్తామన్నారు. పశువైద్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ముస్లిముల కోసం ఎకరం స్థలం కేటాయించి నిధులు మంజూరు చేసి మధరా నిర్మిస్తామని చెప్పారు. నూకాలమ్మ గుడికి ఐదు కోట్ల రూపాయల మంజూరు చేస్తామని చెప్పారు. జీప్లస్ 3 ద్వారా అందరికీ ఇళ్లు – నిర్మిస్తామన్నారు. కశింకోట ఎదురుపర్తికి ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. జూనియర్ కాలేజీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 1985లో కోట్ల రూపాయలు అనకాపల్లిని అభివృద్ధిచేస్తానని అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలూచీ రాజకీయాలను గుర్తించి తెలుగుదేశంపార్టీని గెలిపించాలని కోరారు.

కాగా, ఈ కార్యక్రమంలో హెూంమంత్రి చినరాజప్ప, మంత్రి కింజరపు అచ్చెంనాయుడు, ఎమ్మెల్యే పంచకర్ల రమేషవాబు, దండారు సత్యనారాయణమూర్తి, సిడిఎస్ పీవో సత్యసాయి శ్రీనివాస్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి , గంవాదం, జిల్లా కార్యదర్శి నాగజగదీష్ మళ్ల సురేంద్ర కొణతాల వెంకటరావు, ధనము, అర్చసిఎస్ చైర్మన్ రమణరావు. కొణతాల వెంకటసావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కార్యకర్తలు, నాయకులు అభిమానులు, అధికారుల, ఘనస్వాగతం పలికారు. అక్కడ నుండి నేరుగా శంకరం మీదుగా అనకాపల్లి నుంకరమెట్ట నుండి చేపలఐబజార్, ఔననాల్గురోడ్ల జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ నుండి స్టేడియంకు చేరుకున్నారు. ఈసందర్భంగా పేదరికంపై గెలుపు మెగా గ్రౌండింగ్ మేను ప్రారంభించారు. పలువురు లబ్దిదారులకు కుట్టుమిషన్లు తదితర పనిముట్లను పంపిణీ చేసారు. వారిచేత ప్రభుత్వ తీరుపై మాట్లాడించారు. ఈనంద ర్భంగా ఆయన పర్యటించిన రోడ్డంతా పనుపుమయంగా మారింది. పార్టీ శ్రేణులు చూపించిన ఆదరాభిమానాలను జీవితంలో మర్చిపోలేనని కార్యకర్తల హర్చడ్వానాల మధ్య, ప్రకటించారు. ముందుగా ఎమ్మెల్యే ఏలా, ఎంపీ అవంత మాట్లాడారు. అనంతరం డిసిఎంఎస్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఆదరణ ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

leave a reply