ఊరిలో పెళ్లికి.. కుక్కల హడావిడి..!

ఊపేకుహా అంటుంది కోవై సరళ ఒక సినిమాలో. అంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి. అలాగే ఉంది ఏపీలో వైసీపీ లీడర్ల దుస్థితి. విశాఖపట్నంకు వ్యక్తిగత పనులపై వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి వైసీపీ బట్టలు చింపుకుని చిందులు వేసినంత పని చేసింది. ఏపీలో పోలవరంకు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్లు వేసిన కేసీఆర్ ను వైసీపీ నాయకులు ఫ్లెక్సీలతో స్వాగతించటంపై విశాఖ ప్రజలు విస్తుపోయారు. కేసీఆర్ విశాఖ పర్యటన సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు హడావుడి అంతా ఇంతా కాదు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి లేఖ రాసింది. ఆయన విశాఖపట్నం పర్యటన నేపథ్యయంలో ఈ లేఖను విడుదల చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలకు కేసీఆర్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నీటిపారుదల ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, నిరుద్యోగ సమస్య విషయంలో ఏపీకి వ్యతిరేకంగా ప్రవర్తించడం నవ్యాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.

తెలుగు ప్రజల మనోభావాలు గుర్తించి ఇక నుంచి రాష్ట్ర మేలుకు కేసీఆర్ సహకరించాలని కోరుతూ ఈ లేఖను విడుదల చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేసీఆర్ ను హోదా పోరాట సమితి లేఖలో కోరింది. ఇప్పటి వరకు కేసీఆర్ అన్ని సందర్భాల్లో ఏపీ పట్ల తన వ్యతిరేకత చాటుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులు, నిరుద్యోగ సమస్య, అమరావతి నిర్మాణంలో అడ్డుపుల్లలు వేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానాలకు స్వస్తి పలికి ఆంధ్ర ప్రజలకు మేలు చేసే చర్యలకు ఒడిగట్టాలన్నారు.

వైసీపీ నాయకుడు, కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన చొక్కాకుల వెంకటరావుతోపాటు పలు వార్డులకు చెందిన నాయకులు కేసీఆర్ కు స్వాగతం పలికి, జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు. ఎయిర్ పోర్టు నుంచి శారదా పీఠానికి వెళ్లే మార్గమంతా స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ 66వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో వైసీపీ అధినేత జగన్, నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయి.

స్టీల్ ప్లాంట్ తోపాటు నగరంలోని పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణవాసులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వెలమ సంఘ నాయకులు కూడా కేసీఆర్ కు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు సినీ నటి రమ్యశ్రీ హైదరాబాద్ నుంచి వచ్చారు. కేసీఆర్ తో వైసీపీ నాయకుడు చొక్కాకుల వెంకటరావు భేటీ అయ్యారు. కొద్ది రోజుల ముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ తెరాసకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

leave a reply