ప్రతీ ఇంటికీ స్మార్ట్‌ ఫోన్‌

శ్రీకాకుళం జిల్లా రాజాంలోని `జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. అలాగే.. రూ.83 వేల కోట్లతో పేదలకు 30 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తున్నామన్నారు.

2004-2014 మధ్య వ్యవసాయం చిన్నాభిన్నమైంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.24 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. సంక్రాతి తర్వాత మిగిలిన రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌ 11 శాతం వృద్ధి సాధించిందని.. అయితే త్వరలోనే మొదటి 5 స్థానాల్లో ఏపీని ఉంచాని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తున్నాం. అవసరమైతే గోదావరి నీటిని శ్రీకాకుళం జిల్లాకు తీసుకువస్తామని సీఎం తెలిపారు. ప్రతీ ఇంటికీ స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ అందించే సౌకర్యం చేస్తామన్నారు. ఏపీలోని ప్రతీ గ్రామం ఒక ఐటీ హబ్‌గా తయారవ్వాలని.. మనమే అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు.

leave a reply