పొడవుగా కనిపించాలనుకుంటున్నారా!

సాధారణంగా మన ఎత్తు అనేది వారసత్వంపైగాని, పుట్టుకపైగాని ఆధారపడి ఉంటుంది. దీనికోసం మనం ఏం చేయలేం కానీ… డ్రెస్సింగ్ విషయంలో చిన్ని చిన్న మెళకువలు పాటిస్తే మరింత అందంగా కనిపించడమే కాదు, మనలోని భౌతిక లోపాలు కూడా ఎదుటివారికి  కనపడకుండా జాగ్రత్తపడచ్చు. ముఖ్యంగా ఎత్తు విషయంలో చాలా మంది తక్కువ ఉన్నామని భాధపడుతుంటారు. ఇటువంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు.

దీని కోసం దుస్తులను సరిగ్గా ఉపయోగిస్తే సరిపోతుంది. కొన్ని రకాల దుస్తులు ధరించినప్పుడు పొడుగ్గా కనిపించడమే కాక అందంగా కూడా కనిపిస్తారు. ఇందుకు ముఖ్యంగా చెక్స్ డిజైన్ ఉన్న దుస్తులు ధరిస్తే పొట్టిగా కనపడేలా చేస్తాయి. ఏక రంగు, నిలువు చారలు ఉండే దుస్తులు వేసుకుంటే పొట్టిగా ఉన్నామనే ఫీలింగ్ నుంచి ఉపశమనం కలుగుతుంది. నడిచేటప్పుడు వంగి నడవడం వల్ల పొట్టిగా కనిపిస్తారు అందుకోసం నిటారుగా నడిస్తే సరి!  కూర్చోవడం వల్ల కూడా పొడవుగా కనిపించే అవకాశం ఉంది.

శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులను ధరించాలని, వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే ఉన్న దానికంటే తక్కువ ఎత్తులో కనబడతారు. అదే బిగుతుగా ఉండే దుస్తుల వల్ల మరింత పొడుగ్గా ఉన్నామనే భావన కలుగుతుంది.

leave a reply