పొడుగ్గా కనిపించడం ఇలా..?

ఏంటి మీరు పొట్టిగా ఉన్నారా..? అందరూ మిమ్మల్ని ఏడిపిస్తున్నారా..? పొట్టి.. పొట్టి అని పిస్తున్నారా..? పొడుగ్గా కనిపించడం కోసం ఎన్నో.. మందులు వాడుతూంటారు.. కాని ఎలాంటి ప్రయోజనం లేదని బాధపడుతున్నారా..? సో.. ఒకసారి.. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి చూడండి.. మీకేమైనా ఉపయోగపడతాయోమో..!

కొన్ని ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్స్ మిమ్మల్ని అందంగా కనిపించేలా చేయడమే కాకుండా, మీలోని లోపాలను పూర్తిగా కప్పివేస్తాయి. అలాగే కొన్ని పద్దతులు మిమ్మల్ని నెగటివ్‌గా చూపించి మీ సమస్యలను మరింత పెద్దవిగా చేసి చూపిస్తాయి. అలాగే కొంచెం పోడవుగా లేని వాళ్ళు పొడుగుగా కనిపించడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

నిటారుగా నిలబడడం..

సాధారణంగా మన హైట్ మన జీన్స్ ద్వార నిర్దారించడం జరుగుతుంది. దీంట్లో మనం చేసేది ఏమి లేదు. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో పొడుగుగా కనిపించడం కష్టం ఏమి కాదు. నిటారుగా నిలబడం, లేదా కూర్చోవడం వలన పొడుగుగా కనిపించవచ్చు. ప్రత్యేకంగా వంగడం వలన ఇంకా పొట్టిగా కనపడడాన్ని గమనించవచ్చు.

సరైన దుస్తులు వేసుకోవడం..

కొన్ని దుస్తులతో కూడా మనం పొడుగుగా కనపడడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా, గళ్ళ డిజైన్లు మరియు చెక్స్ ఉన్న దుస్తులు ఉన్నదానికంటే పొట్టిగా కనపడేలా చేస్తాయి. అలాగే, ఒకటే రంగు డ్రెస్ వేసుకోవడం వలన పొడుగుక కనపడవచ్చు. అడ్డ డిజైన్లు కాకుండా, నితరుగ ఉండే డిజైన్లు కూడా పొడువుగా ఉన్నట్టు కనపడవచ్చు.    

బిగువైన దుస్తులు వేసుకోవడం

ఇంకొక సులువైన చిట్కా ఏంటంటే.. పొడువుగా కనపడడానికి ఏదైనా ఉందంటే అడి బిగుతు దుస్తులు వేసుకోవడం. వదులుగా ఉండే దుస్తులు ఉన్న దానికంటే తక్కువ హైట్ ఉన్నట్టు కనపడెల చేస్తాయి. అలాగే  బిగుతు దుస్తులు పొడువుగా కనపడేలా చేస్తాయి.

leave a reply