సక్సెస్..కక్ష్యలోకి చేరిన జీశాట్ !

జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విజయవంతం – కక్ష్యలోకి చేరిన జీశాట్..

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్షప్రయోగ కేంద్రం నుండి ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వీ – ఎఫ్ 11 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. 26గంటల సుదీర్ఘ కౌంట్ డౌన్ అనంతరంషార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి సాయంత్రం 4గంటల 10 నిముషాలకు జిఎస్ఎల్వీరాకెట్ నిప్పులు చిమ్మూతూ గగనతలంలోకి దూసుకెళ్లింది. మొత్తం మూడు దశల్లో రాకెట్ పయనం సాగింది. 15 సెకన్లకు మొదటి దశ పూర్తి కాగా, దాని తర్వాత మరో16 సెకన్లకు రెండో దశ పూర్తయ్యి కీలకమైన క్రయోజనిక్ దశ మొదలైంది. ఎక్కడా చిన్నతేడా కూడా లేకుండా క్రయో దశ శాస్త్రవేత్తలు నిర్ధేశించిన విధంగా సాగింది. ప్రయోగంమొదలైనప్పటి నుండి 16 నిముషాల 29 సెకన్లకూ జిఎస్ఎల్వీ వాహక నౌక ఉపగ్రహాన్నినిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ ద్వారా భూ స్థిర కక్ష్యలోకి చేరిన2250 కిలోల బరువైన జీశాట్ 7ఏ ఉపగ్రహం 8 ఏళ్ల పాటూ తన సేవలను అందించనుంది. ముఖ్యంగా వైమానికి రంగానికి ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయిన తర్వాత ఇస్రో ఛైర్మైన్ శివన్ సహచర శాస్త్రవేత్తలను అభినందించారు.

leave a reply