కడప స్టీల్ ప్లాంట్‌..

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగానే చైనా కంపెనీకూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఏడాదికి 7 మిలియన్ మెట్రిక్ టన్నులఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంటు పెట్టటానికి సిద్ధంగా ఉన్నట్లు స్టీల్ ప్లాంటుప్రతినిధులు ముందుకు రావటం గమనార్హం. చంద్రబాబునాయుడుతో భేటీ సందర్భంగా తమప్రణాళికలను వివరించారు. తమ ప్లాంటు ఏర్పాటుకు వీలుగా ఏదైనా పోర్టు సమీపంలో 2 వేలఎకరాల స్ధలం కావాలంటూ ప్రతిపాదనలు అందించారు. చైనా-ఇండియా స్టీల్ ప్లాంట్ప్రాజెక్టులో భాగంగానే తాము ప్లాంటు ఏర్పాటుకు ఏపీని ఎంచుకున్నట్లు చెప్పటంగమనార్హం.

ఆసియా దేశాలతో వాణిజ్యం, భారతదేశంలో స్టీలుకున్న డిమాండ్ తదితరాలను అధ్యయనం చేసిన తర్వాతే ఇండియాలో ప్లాంటు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తమ ప్లాంటు ఏర్పాటుకు ఏపీ అయితే అన్ని విధాల బాగుంటుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు. ముడి ఇనుము, బొగ్గు గనులకు సంబంధించి ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకున్నామని, వివిధ దేశాలతో కూడా వ్యాపారపమైన ఒప్పందాలు చేసుకున్నట్లు చంద్రబాబుకు వివరించారు.

చైనా ప్రతినిధితులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టుతో తనను కలవాలని చంద్రబాబు చెప్పారు. నిజానికి కడపలో స్టీల్ ప్లాంటు పెట్టటానికి ప్రభుత్వం వద్ద ఎలాగూ డబ్బు లేదు. కాబట్టి కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు బాధ్యతను చైనా కంపెనీకే ఎందుకు ఇవ్వకూడదో చంద్రబాబు ఆలోచిస్తే బాగుంటుంది.

ఛైనా కంపెనీతో భాగస్వామ్యం క్రింద కడప స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తే ప్రభుత్వ వాటా క్రింద ముడి ఇనుము గనులను, భూమిని ఇస్తే సరిపోతుందేమో. ప్రభుత్వం చేతి నుండి డబ్బు రూపంలో పెట్టుబడి అవసరం ఉండదు, చైనా కంపెనీకి ప్లాంటు ఏర్పాటుకు ఇనుము గనుల కోసం వెతుక్కోవాల్సిన అవససరమూ ఉండదు. సరే ఏదేమైనా ఎన్నికలకు ముందు భారీ పరిశ్రమలు పెడతామని పారిశ్రామికవేత్తలు ముందుకు రావటం చంద్రబాబుకు మంచిదే కదా..

leave a reply