‘నరకాసురుడు’ చిత్రం ఫస్ట్‌లుక్‌

ప్రముఖ నటుడు అరవింద్‌ స్వామి, హీరో సందీప్‌ కిషన్, శ్రియ ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం ‘నరకాసురుడు’. తమిళంలో ఈ చిత్రం ‘నరగాసురన్‌’గా రూపొందుతుంది. ఈ సినిమాకి కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా.. ఈ సినిమా పోస్టర్‌ మొదటి లుక్‌ను ఈ యూనిట్‌ లాంచ్‌ చేశారు. పోస్టర్‌ను చూస్తుంటే చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. అందరూ టెన్షన్‌ ఫీలవుతున్నట్లు అనిపిస్తోంది. థ్రిల్లర్‌ చిత్రంగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. గతంలో కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధృవంగళ్ పతినారు’. దీనిని తెలుగులో ’16’ పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రం అప్పుడు మంచి విజయాన్ని అందుకుంది.

leave a reply