బ్రేక్‌ఫాస్ట్‌ని బ్రేక్‌ చేస్తున్నారా..?

ఆఫీస్‌లకి టైం అవుతుందనో లేక బరువు తగ్గాలనో కానీ.. చాలా మంది ఉదయం బ్రేక్‌పాస్ట్‌ చేయడం మానేస్తారు. లేదా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటారు. దాని వల్ల ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోవడం వల్ల బీపీ, షుగర్‌ వంటి వ్యాధులు తొందరగా వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఉదయం స్టమక్‌ను సాధ్యమైనంత వరకూ ఖాళీగా ఉంచకుండా చూడలని సూచిస్తున్నారు.

మార్నింగ్‌ వాకింగ్స్‌, వ్యాయామం చేసిని తర్వాత శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్‌, పిండి పదార్థాలు, పీచు, ఐరన్‌ ఎక్కువగా ఉండేలా అల్పాహారాన్ని తయారు చేసుకోవాలి. పోషకాలతో కూడిన అల్పాహారం బరువును అదుపులో ఉంచడంతో పాటు రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉదయం నుంచి మెదడు, కండరాలు చురుగ్గా పని చేయాలంటే అత్యవసరంగా కెలోరీలు కావాలి. పిండి పదార్థాలు కూడా అవసరమే. వీటన్నింటికీ అల్పాహారం ఉపయోగపడుతుంది. రాత్రి భోజనం చేశాక చాలా సమయం పొట్ట ఖాళీగా ఉంటుంది. కాబట్టి దాన్ని బ్రేక్‌ఫాస్ట్‌తో సమం చేయాలి.

ఉదయం పూట సరైన ఆహారం తీసుకోకపోతే పనిలో ఏకాగ్రత ఉండదు. తరగతి గదిలో ఇతర విషయాలపైకి దృష్టి మళ్లుతుంది. అలాగే.. పనిమీద దృష్టి పెట్టలేరు. చాలా చిరాకుగా ఉంటుంది. అలాకాకూడదంటే పొద్దున్నే పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం కంపల్సరీ.

leave a reply