మేనిఫెస్టో ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్

రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. తాను ఏమి చేయగలనో అన్ని అంశాలను  నిపుణులతో చర్చించి మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ముఖ్యంగా రైతులు,నిరుద్యోగులు,మహిళలు, విద్యార్థులపైనా హామీల వర్షం కురిపించారు.

మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు..

ప్రతి ఏకరాకు సాగు సాయం రూ.8వేలు అందిస్తామని పేర్కొన్నారు.
60 ఏళ్లు పైబడిన అన్ని వర్గాల రైతులకు నెలకు రూ.5,000 పింఛను
రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు
రాష్ట్ర పారిశ్రామికీకరణలో రైతులకు భాగస్వామ్యం
భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లింపు
ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు
ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజక్ట్ సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు
ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించేలా చర్యలు
డ్వాక్రా మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
మహిళలకు శాసనసభలో 33శాతం రిజర్వేషన్లు
బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు
లంచాలు తీసుకునే వీల్లేకుండా ప్రత్యేక వ్యవస్థ రూపకల్పన
ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్యబీమా
ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
మొదటి ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాల రూపకల్పన
ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పిచటం తమ పార్టీ లక్ష్యమని ప్రకటించారు.
ప్రతి మండలంలో గోడౌన్లు
ప్రభుత్వోద్యోగుల కోసం సీపీఎస్‌ రద్దు
ముస్లింల ఎదుగుదల కోసం సచార్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయటం.
మహిళలకు పావలా వడ్డీకే రుణాలు
మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంకు.
ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు, ఆస్పత్రి నిర్మాణం,మహిళల భద్రత కోసం కొత్త చట్టాల రూపకల్పన
ఉత్తరాంధ్రలో నదులు అనుసంధానంపై ప్రత్యేక దృష్టి

leave a reply