‘యాత్ర’ మూవీ రివ్యూ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ జీవితాధారంగా తెరెకెక్కిన చిత్రం ‘యాత్ర’. కాగా.. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు రెండున్న దశాబ్దల తరువాత మళయాల మెగాస్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌కు  రీ ఎంట్రీ ఇచ్చారు. అందులోనూ.. ఈ సినిమా కాంట్రవర్సీ కాకుండా డైరెక్టర్‌ మహి.వి రాఘవన్‌ సీఎం చంద్రబాబు పాత్ర లేదని ముందుగానే చెప్పు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే.. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలి.. మరింకెందుకు ఆలస్యం.. కథలోకి వెళ్దామా..!

అసలు కథేంటంటే: ప్రజల్లోకి వెళ్లి వాళ్ల గురించి తెలుసుకోవాలని వైఎస్ ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్ర మొదలు పెడతారు. పాద‌యాత్ర ఎలా మొద‌లుపెట్టారు? ఆ ప్ర‌యాణంలో ప్ర‌జ‌ల క‌ష్టాల్ని ఎలా విన్నారు? వాళ్ల‌కి తానున్నాన‌నే భ‌రోసా ఎలా ఇచ్చారు? వైఎస్సార్‌ ప్ర‌వేశపెట్టిన ఉచిత ‌విద్యుత్తు, ఆరోగ్య‌శ్రీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ త‌దిత‌ర పథకాలకి పాద‌యాత్ర ఎలా కార‌ణ‌మైంది?. జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ, హై క‌మాండ్‌ని కాద‌ని ఆయ‌న ఎలా నిర్ణ‌యాలు తీసుకునేవారు? తీసుకున్నా అవి హైకమాండ్‌కి ఎగేనెస్ట్‌గా ఉండకుండా ఏం చేశారు..? తదితర విషయాలను మనం ఈ సినిమాలో చూడవచ్చు. సమయానుకూలంగా వైఎస్‌ స్పందించేవిధానం, తీరు ఈ సినిమాలో కనిపిస్తాయి. ప్రజల్లోకి వెళ్లి ఇమేజ్‌ను ఎలా తెచ్చుకోవాలి..? అందుకు వాళ్ల మనసుల్లోకి వెళ్లాలి.. వాళ్ల కష్టాలు తెలుసుకోవాలని పాదయాత్ర చేయాలనుకుంటారు వైఎస్‌. హైక‌మాండ్‌తో సంప్రదింపులు, పాద‌యాత్ర నుంచి, ఆయన ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేయ‌డంతో ఈ క‌థ ముగుస్తుంది.

ఎవరెలా చేశారంటే: మీ సాయం కావాలి అని ఇంటికొచ్చి అడిగిన వారు శత్రువులైనా సరే సహాయం చేయాలనుకునే రాజన్న వ్యక్తిత్వానికి జోహార్లు చెప్పాల్సిందే. అలాంటి పాత్రలో ముమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. మళ్లీ తెరపై నిజమైన వైఎస్‌ను చూసిన అనుభూతి కలిగింది. వై.ఎస్‌లా క‌నిపించ‌క‌పోయినా, ఆయ‌న హావ‌భావాల్ని అనుక‌రించ‌క‌పోయినా ఆ పాత్ర ఆత్మ‌ని అర్థం చేసుకుని న‌టించారు. సినిమాలో సెంటిమెంట్‌, భావోద్వేగాలు పండ‌టంలో మ‌మ్ముట్టి ప‌నితీరు ముఖ్య‌ పాత్ర పోషించింది. వై.ఎస్ ఆత్మీయుడైన కేవీపీ రామ‌చంద్ర‌రావు పాత్ర‌లో రావు ర‌మేష్, వై.ఎస్‌.విజ‌య‌మ్మ పాత్ర‌లో ఆశ్రిత వేముగంటి చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. వై.ఎస్‌.రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపిస్తారు. కొన్ని కొన్ని సీన్లలో జగపతి బాబా, ముమ్ముట్టా అనే విధంగా నటించారు. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ చక్కగా సరిపోయింది.

రెగ్యులర్‌ బయోపిక్‌లా కేవలం కథ చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. ప్రతీ ప్రేక్షకుణ్ని పాదయాత్రలో భాగం చేశాడు. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. అక్కడక్కడ పొలిటికల్‌ సెటైర్‌లు కూడా బాగా పేలాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర పెద్దల ఆహార్యం, వారి డైలాగ్స్‌ సినిమాకు కామెడీ టచ్‌ ఇచ్చాయి.

చివరకు.. వైఎస్‌ అభిమానులకు ఈ సినిమా ఒక పండుగనే చెప్పాలి.

leave a reply