ఏపీకి కేంద్రం మరో షాక్!

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి కొత్త షాక్ ఇచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన విజయవాడ-గుంటూరు కొత్త రైల్వేలైనుకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ రైల్వే లైనును ప్రతిపాదించి దాదాపు ఏడాది గడిచిపోయినా ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఎట్టకేలకు బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే లైన్‌ పనుల ఆమోదానికి సంబంధించిన దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందంని సమాధానమిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కొత్తరాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ఈ రైల్వేలైనుకు గతంలో ప్రతిపాదించగా, నీతి అయోగ్‌ సిఫార్సు అంటూ ప్రతిపాదించిన పనులను ఆమోదించేందుకు అంగీకరించడం లేదు. ఉపరితల రవాణాశాఖ, పట్టణాభివృద్ధి శాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడమే దీనికి కారణమని, అప్పటి వరకు రైల్వే లైన్‌కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

leave a reply