వెంట్రుకల సమస్యకు… ఇలా చేస్తే సరి!

సాధారణంగా ప్రస్తుత జీవన శైలిలో ప్రధాన సమస్య జుట్టు రాలిపోప్వడం. ఇది కొందరికి జీన్స్ వల్ల రావచ్చు కొంతమందికి అనారోగ్యం వల్ల  కూడా రావచ్చు. శరీరంలో  ఎలాంటి చెడు జరిగినా ఆ ప్రభావం వెంట్రుకల్లో తెలుస్తుంది. ప్రస్తుత జీవనంలో ఆహార మార్పుల కారణంగా శరీరానికి సరిపడా పోషకాలు అందకపోయినా ఆ ప్రభావం వెంట్రుకల ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఆహారం ద్వారా శరీరంలో చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. ఇలా ఖర్చయిపోగా మిగిలిన పోషకాలు మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు చేరతాయి. ఒకవేళ మనం తీసుకొనే ఆహారంలో మనకు సరిపడా పోషకాలు అందకపోతే దాని ప్రభావం  వెంట్రుకల మీద పడుతుంది.దీంతో తరచు వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది.

కావున, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేస్తే సరి. ముందుగా ప్రతి రోజు మనం తీసుకొనే ఆహారంలో  పోషకాహారాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి, అంతేకాకుండా విటమిన్‌ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్‌ క్రమం తప్పకుండ శరీరానికి అందేలా చూసుకోవాలి. ఇందుకోసం మనం తీసుకొనే ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని సమయాలలో అధిక ఒత్తిడి వల్ల కూడా వెంట్రుకలు రాలిపోయే సమస్య వస్తుంది, దీని కోసం ఒత్తిడి భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం వాలా ఒత్తిడిని అధికమించవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా కూడా వెంట్రుకల సమస్య రావొచ్చు ఇందుకోసం వీలైనంతవరకు కాలుష్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.  

leave a reply