కీళ్ల నొప్పులు ఉంటే… రన్నింగ్ కన్నా ముందు!

సాధారణంగా నడిచేటప్పుడు గాని, మెట్లు ఎక్కేటప్పుడు గాని ఎప్పుడైనా కీళ్లల్లో కాస్త నొప్పి అనిపిస్తే దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ, తరుచూ అలా నొప్పి అనిపిస్తున్నప్పుడు గానీ, ఏదో సమస్య ఉన్నట్లు ఎవరైనా గుర్తించిన. అది వాకింగ్‌ లేదా జాగింగ్‌లు చేస్తే మోకాళ్లకు సంబంధించిన సమస్యలూ తొలగిపోతాయనే భావన ఉంటుంది. కానీ, అంతకన్నా ముందు తొడ, పిక్క కండరాలు గట్టిపడే వ్యాయామాలు చెయాలనే విషయం చాలా మందికి తెలియదు.

నిజానికి, మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడాలంటే, కాలు, పిక్క కండరాలు గట్టిపడే వ్యాయామాల్ని చేయాలి.  కొన్ని సార్లు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది అనుకునే వారు ఇది పూర్తిగా నయం అవ్వడానికి సరైన వ్యాయామం చేయాలి… వ్యాయామం 6 నుంచి 8 వారాల దాకా చేసి ఆ తర్వాతే రన్నింగ్‌ గాని జాగింగ్ గాని చేయాలి. అలా ఏమీ చేయకుండా సరాసరిగా రన్నింగ్‌లు చేస్తే కలిగే లాభం మాట అటుంచి, మోకాలు కీలు మరింత దెబ్బ తినే ప్రమాదం ఉంది.

ఇతర వ్యాయామాలన్నీ చేశాక కూడా రన్నింగ్‌లో నొప్పి అనిపిస్తే, కొద్ది రోజుల పాటు విరామం తీసుకొని, ఐస్‌ గడ్డను గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న భాగాల్లో ఉంచి అటూ ఇటూ తిప్పాలి. నొప్పి తగ్గగానే మళ్లీ వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇలా తగ్గిన నొప్పి అంతటితో పూర్తిగా పోతే సరి! ఒకవేళ కొద్ది రోజుల తర్వాత నొప్పి మళ్లీ వస్తే, వెంటనే ఫిజియో థెరపి్‌స్టను గానీ, ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ను గానీ, సంప్రదించాలి.

leave a reply