జిమ్‌కి వెళ్తూ… ఇవి కూడా!

ఇప్పుడున్న తీరికలేని జీవితంలో వ్యాయామం ఎంతో అవసరం. అంతేకాకుండా శరీర ఆకృతి మార్చుకునేందుకు బరువు తగ్గడానికి జిమ్ కి వెళ్తుంటారు. అంతేకాక ఆరోగ్యంపై శ్రద్ద పెరగడంతో జిమ్ చేస్తుంటారు. అయితే జిమ్‌కి వెళ్లేటప్పుడు ఎక్కువగా తీసుకెళ్లే వస్తువుల్లో ట్రాక్‌సూట్‌, బూట్లు, వాటర్ బాటిల్స్ మాత్రమే కాకుండా మరి కొన్ని వస్తువులను తీసుకెళ్తే మంచిదట! అవేంటో తెలుసుకుందాం.

మనం వ్యాయామం చేసేటప్పుడు కొన్ని సార్లు మన వేగంతో పాటు గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది దాని వేగం తెలుసుకునేందుకు వెంట హార్ట్‌రేట్‌ మానిటర్‌ని ఉంచుకుంటే మంచిదట. ఇందుకోసం మొబైల్ లో దీనికి సంబంధించిన యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. దీంతో గుండె వేగాన్ని అంచనా వేసి వ్యాయామాన్ని కొనసాగించవచ్చు.

వ్యాయామం చేసాక శరీరం కేలరీకను కోల్పోతుంది, దీంతో శక్తిని కూడా కోల్పోతాం. అందుకే మీ బ్యాగులో పల్లీలు, ఏదయినా ఎనర్జీబార్‌ వంటివి అందుబాటులో ఉంచుకుంటే అవసరమైనప్పుడు శక్తిని తిరిగి పొందవచ్చు. అంతేకాకుండా చెమట పట్టిన శరీరాన్ని తుడుచుకునేందుకు టిష్యూలు, టవల్స్ వంటివి అందుబాటులో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.

leave a reply