సోషల్ మీడియా… నియమాలు!

భారత దేశ పరిపాలనఅంతా రాజ్యగంనికి లోబడి జరగాలి. అధికారం చేతిలో ఉంది కదా అని అదేశిక సూత్రాల పేరుతో రాజ్యగం హక్కులకు భంగం కలిగించిన ప్రతిసారి న్యాయ వ్యవస్థ మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. 2000 వ సంవత్సరంలో సమాచార సాంకేతిక విజ్ఞాన చట్టం (ఐటి చట్టం 2000) లో సెక్షన్ 66-ఎ సుప్రీం కోర్ట్ ధర్మాసనం రద్దు చేస్తూ ఇది రాజ్యగం పౌరుల హక్కులకు భంగం కలిగిస్తుంది అని పేర్కొంటూ సోషల్ మీడియా పోస్టుల మీదచేసే అక్రమ అరెస్ట్’లు రాజ్యంగవిరుద్ధం అని, పౌరుల హక్కుల్లోభాగంగా ఉన్న బావప్రకటనా స్వేచ్ఛ,వాక్  స్వాతంత్ర్యంకు వ్యతిరేకం అని పేర్కొంది.

భారత్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని ప్రభుత్వం అంటే ప్రజలే అని పాలకులు ప్రజలకు కావాల్సినవాటిని అందించడానికి సేవకులు మాత్రమే గాని ప్రజలు అధికార ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడితే అది తడి గుడ్డతో ప్రజల గొంతు కోసినట్టే అవుతుంది.ఆ ప్రశ్నించడం సోషల్ మీడియా కావొచ్చు ఇంకేదయిన మాధ్యమం కావొచ్చు. అధికారం ఇచ్చింది ప్రజలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకూ, కొనే రూపాయి వస్తువు మొదలు అన్నిటికి అల్టాక్సెస్ అని ట్యాక్స్ కట్టి నాయకులు జీతాలు ఇస్తూ పోషిస్తుంది ప్రజలే. అంటే…నాయకుడు బ్రతుకుతుంది ప్రజల డబ్బుతో, మరి అవినీతికి పాల్పడితే ప్రశ్నిస్తారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకం అని అరెస్ట్చేసే అధికారం ఎవ్వరికి లేదు. ఒక సామాజిక కార్యకర్త జయలలిత అవినీతి చేశారుఅని సోషల్ మీడియాలో పెట్టినప్పుడు, జయ పరువు నష్టందావా వేస్తే… న్యాయస్థానం జయకు ఇది ప్రజల హక్కు, మీరు నిరుపించుకోండి అవినీతి చేయలేదు అనిలేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోండి. రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలిఅని పేర్కొంది. మ్ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రిఅయినా, ఏ గవర్నమెంట్అధికారి అయ్యినా… చట్టం ముందు అందరూ సమానులే. అధికారంతో అవినీతి చేస్తే అదిప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి, ప్రశ్నించే అధికారం ప్రజల హక్కు.

ఎలాంటి పోస్టులకు సైబర్ క్రైమ్ ఐటి చట్టాలు వర్తిస్తాయి.

దేశభద్రతకు సమగ్రతకు భంగం కల్గిస్తు, సమాఖ్యకు విఘాతం కల్గించే పోస్టులు చేయడం. జాతీయ చిహ్నాలు అవమానించే పోస్టులు పెట్టడం. మహిళలమాన అభిమానాలకు వ్యతిరేకంగా పౌరుల ఆత్మహత్యలకు పురి గొల్పే పోస్టులు పెట్టడం. న్యాయస్థానంఇచ్చే తీర్పులను, చట్టాలను గౌరవించకుండా కామెంట్స్ చేయడం. నిరాధారమైనఅనుచిత వ్యాఖ్యలతో వ్యక్తుల వ్యక్తిగత విషయాల పైన కామెంట్స్ చేస్తూ పోస్టులుపెట్టడం, ఇవినెరపూరిత మైనవి.

leave a reply