యువకుని హృదయం…చోరీ

ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో నాగపూర్ పోలీసులు ఏం చేయాలో తెలీక  తికమకపడ్డారు. ఈ పరిస్థితి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు ఏమి జరిగింది అని అడిగారు.. నా హృదయం కనిపించట్లేదు అని ఒక యువతీ తన హృదయం దొంగిలించిందని. ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడమే కాక , ఎలాగైనా  మీరు ఆమెను వెతికి పెట్టాలని నా హృదయాన్ని నాకు ఇప్పించాలని’ కోరాడు. అది విని పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఈ ఫిర్యాదులు తీసుకోవడం కుదరదని పోలీసులు తేల్చిచెప్పారు. కానీ ఆ యువకుడు పట్టుబట్టడంతో… ఏం చేయాలో తెలియక ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఫిర్యాదుఫై ఉన్నతాధికారులతో చర్చించిన అధికారులు, వారి ఆదేశాల మేరకు  ఇలాంటి సమస్యలు పరిష్కరించలేమని చెప్పి యువకుడిని పంపించేశారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ భూషణ్‌ కుమార్‌ ఉపాధ్యాయ్ మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి సమాచారాన్ని తెలిపారు. ‘పోయిన వస్తువులను వెతికి పెట్టడానికి మేం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఇలాంటి వెతికి పెట్టలేని కేసులు కూడా మా వద్దకు వస్తుంటాయి’ అని చెప్పుకొచ్చారు.

leave a reply