వివాదాలతో విడుదలైన ‘మణికర్ణిక’ చిత్రం విజయవంతమై థియేటర్స్‌లో దూసుకెళ్తుంది. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కూడా చక్కటి వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలిరోజే ఈ సినిమా అన్ని బాషల్లో కలిపి ఈ రూ.8.75 కోట్లను వసూలు చేసింది.
అయితే తాజాగా ఈ చిత్రంపై మోగాస్టార్ చిరంజీవి స్పందిచారు. మణికర్ణిక సినిమా చాలా బావుంది. అందులో కంగనా రౌనౌత్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. కొన్ని వైవిధ్యభరితమైన సన్నివేశాల్లో ఆమె చాలా చక్కగా నటించారని మెచ్చుకున్నారు. కంగన నటన, ఆమె నిలువరించే తీరు, పోరాట ఘట్టాలను చూసి మెగాస్టార్ మురిసిపోయారు. కాగా.. ‘సైరా నరసింహా రెడ్డి’ ఏఎమ్‌బీ సినమాస్ మల్టీప్లెక్స్‌లో సందడి చేశారు. సైరా నరసింహారెడ్డి టెక్నీషీయన్ టీం మొత్తం ‘మణికర్ణిక’ సినిమాను చూశారు. చిరు కథానాయకుడిగా వస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.