ఆసీస్ కోచ్‌గా…పాంటింగ్‌!

ఆస్ట్రేలియా మాజి కెప్టెన్ పాంటింగ్ అసిస్టెంట్‌ కోచ్‌గా మళ్ళి దర్శమివ్వబోతున్నాడు. కానీ రికీ పాంటింగ్‌ ఇదివరకే ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పని చేసాడు. అయితే త్వరలో జరగనున్న వరల్డ్‌కప్‌కు వెళ్లే ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. తాజాగా పాంటింగ్‌ను వరల్డ్‌కప్‌కు వెళ్లే ఆస్ట్రేలియా అసిస్టెంట్‌ కోచ్‌గా నియమిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఆసీస్‌ రెగ్యులర్‌ బ్యాటింగ్‌ కోచ్‌ గ్రేమ్‌ హిక్‌ రాబోవు యాషెస్‌ సిరీస్‌కు సిద్దమవగా ఉండగా, వరల్డ్‌కప్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా పాంటింగ్‌ను నియమించారు. 2017, 2018ల్లో ఆస్ట్రేలియా టీ20 జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పాంటింగ్ పనిచేసాడు. గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన ఆసీస్‌ జట్టుకు లాంగర్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలో పాంటింగ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నాడు. ఐదు వరల్డ్‌కప్‌ ఆడిన అనుభవంతో పాటు మూడు వరల్డ్‌కప్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో అతనివైపే మళ్లీ సీఏ మొగ్గు చూపింది.

దీనిపై పాంటింగ్ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌కు వెళ్లే ఆసీస్‌ జట్టు సహాయక కోచ్‌గా వ్యవహరించడం చాలా ఆనందకరమని. గతంలో వన్డే, టీ20 జట్లకు అసిస్టెంట్‌ కోచ్‌గా పని చేయడాన్ని బాగా ఆస్వాదించాను. కానీ వరల్డ్‌కప్‌కు కూడా నాపై నమ్మకం ఉంచి ఆ బాధ్యతను అప్పగించినందుకు సీఏకు ధన్యవాదాలు. వరల్డ్‌కప్‌లో మా జట్టు ప్రత్యర్థులను ఎదురుకోవడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నాడు.

leave a reply