చిత్తుగా ఓడిన భారత్…చేజారిన క్లీన్‌ స్వీప్‌!

టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నాలుగో వన్డేలో కివీస్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. టీమిండియా ఇప్పటియికే న్యూజిలాండ్ జట్టుపై 3-0 తేడాతో సిరీస్‌ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 92 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. కివీస్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే పరిమితమైంది. గురువారం హామిల్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 30.5 ఓవర్లలో 92 పరుగులు చేసి కిసీఎస్ ముందు 93పరుగుల లక్ష్యాన్నిఉంచింది. కివీస్ 14.4 ఓవర్లలో కేవలం రొండు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. టీమిండియాపై కివీస్‌ జట్టు దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 3-1 తేడాతో క్లీన్‌ స్వీప్‌ భారీ నుంచి తప్పించుకుంది.

అటు 200వన్డే ఆడుతున్న రోహిత్‌ శర్మకు ఈ మ్యాచ్ చేదు అనుభవాన్ని ఇచ్చింది. తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఆరంభించిన కివీస్, ఆదిలోనే ఓపెనర్లను పెవిలియన్కు పంపింది. ఆపై ఒక్కొక్కరిగా టీంఇండియన్ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్ బాట పట్టారు. తరువాత 93 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకిదిగిన కివీస్ తొలి ఓవర్లోనే తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌(14)ను భువి పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత వన్‌డౌన్‌గా వచ్చిన విలియమ్సన్‌ కూడా భువి ఔట్‌ చేయడంతో టీమిండియాకు రొండు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్‌(30 నాటౌట్‌), రాస్‌ టేలర్‌(37 నాటౌట్‌)లు జట్టుకు ఘన విజయాన్నిఅందించారు. దీంతో కివీస్  రెండు వికెట్ల నష్టానికి  93 లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్‌ బౌల్ట్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు సాధించాడు. 

leave a reply