దశాబ్దాల..కోరిక

ఆస్ట్రిలియా గడ్డఫై టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆసీస్ ఫై గెలిచి తన దశాబ్దాల కల నెరవేర్చుకుంది. 4 టెస్టుల సిరీస్‌లను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకొని  72 ఏళ్ల కలను తీర్చుకుంది. ఆసీస్‌ గడ్డపై ఇన్నేళ్ల తర్వాత తొలి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లిసేనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ గెలవాలన్న భారత్‌ దశాబ్దాల కల నెరవేరడంతో మాజీ క్రికెటర్లు.. సినీ తారాలు, రాజకీయ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ..  భారత ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతున్నారు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని కోహ్లీ సేన ముద్దాడి విదేశీగడ్డపై సత్తా చాటింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.

నాలుగవ రోజు అట ప్రారంభం కాకముందు వర్షం ఆ తర్వాత వెలుతురు సరిగా లేకపోవడం భారత జట్టును తీవ్రంగా ననిరాశపరిచింది. అయితే తిరిగి మొదలైన ఆటలో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. దీనితో ఆసీస్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.  స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (5/99) సూపర్‌ షోతో ఆస్ట్రేలి యా తొలి ఇన్నింగ్స్‌లో 104.5 ఓవర్లలో 300 పరుగులకు కుప్పకూలింది.  ఐదో రోజు వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగించడంతోఆట ఒక్క బంతి కూడా పడకుండానే అట నిలిచిపోయింది. దీంతో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు నమోదు చేసిన భారత నయావాల్‌ పుజారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను గెలుచుకున్నాడు.

leave a reply