సమయపాలన కోసం ఉదయాన్నే!

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో  సమయపాలన చాలా అవసరం అంటున్నారు. ఆలస్యం చేయడం వల్ల కంగారు, ఒత్తిడి పెరుగుతాయి. కొన్నిసార్లు బాస్‌ల ఆగ్రహావేశాలకూ లోను కావల్సి ఉంటుంది. ఇవన్నీ మీ సామర్థ్యాలపై పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి సమయపాలన పాటించడం ఎంతో ముఖ్యం.

ముందుగా కార్యాలయానికి వచ్చిన వెంటనే కొందరు కాఫీ, టీలు తాగేస్తుంటారు. అలా కాకుండా… కనీసం గంటా, గంటన్నర తర్వాతే ఇలాంటివి తీసుకుంటే మంచిది. రోజులో పని మొదలుపెట్టిన తొలి రెండు గంటల్లోనే మనలో కార్టిసాల్‌ హార్మోను ఉత్పత్తవుతుంది. ఇది పని చేయడానికి అవసరమైన శక్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తుంది. కాఫీలోని ‘కెఫీన్‌’ కూడా అలాంటి ప్రేరకమే. కాకపోతే ఇవి రెండూ ఒకేసారి శరీరంలోకి రావడం వల్ల ఉత్సాహం పెరగడం కాకుండా చికాకుగా అనిపిస్తుంది.

ఎక్కువగా ఉదయం పూట ఏకాగ్రత, శక్తిసామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆఫీసుకు రాగానే క్లిష్టమైన పనులు చేసుకొవాలి. అలా కాకుండా తేలికపాటి పనులు చేయడం మొదలుపెడితే… మిగిలినవి పూర్తిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. రోజంతా చక్కని వాతావరణం కావాలంటే కార్యాలయానికి రాగానే సహోద్యోగుల్ని చిరునవ్వుతో పలకరించాలి. ఆ పలకరింపు అందరి మధ్య మంచి వాతావరణాన్ని నెలకొల్పుతుంది.

leave a reply