బానిసత్వానికి… ధ్యానం!

మద్యం సేవించే వారు ఎక్కువగా మద్యానికి బానిసలవుతుంటారు. వాళ్లు తాగుడు మానాలని ఎన్ని రకలుగా ప్రయత్నించినా ఫలితం మాత్రం కనిపించదు. వాళ్ళను వాళ్ళు  నియంత్రించుకోలేక మళ్లీ అదేవిధంగా మద్యానికి బానిసలవుతుంటారు. అయితే, తాగుడుకు పూర్తిగా దూరం కావాలంటే ధ్యానం చేస్తే కొంతవరకు అవకాశం ఉంటుందని యూకేలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు తెలిపారు.

ఇందుకోసం ప్రతిరోజు చేసే వ్యాయామంతో పాటు కనీసం 12 నిముషాలు ధ్యానం చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి మానసిక ప్రశాంతత ఏర్పడటంతో మద్యం సేవించాలన్న భావన దూరమవుతుందని వారు వివరించారు. దాదాపు 68 మంది మద్యానికి బానిసలైన వారిఫై వారం పాటు అధ్యయనం జరపగా వారిలో మద్యం సేవించాలన్న ఆలోచనే దూరం అయ్యిందని వెల్లడించారు. అయితే ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండటం విశేషం.

leave a reply