మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు

‘మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు, అలాగే ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసుకుని రెడీగా ఉండండి’ అని వివాదాల డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న ఆలయాల్లో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటలకల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు.’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా.. ఎన్నో వివాదాలతో రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ నెల విడుదల కానున్న ఎన్టీఆర్‌ ‘మహానాయకుడు’కు తగ్గట్టూగా వర్మ కూడా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దొరికిందే కదా అని వర్మ తన సినిమా ప్రచారానికి ఆది నుంచి సోషల్ మీడియాను బాగా వాడేస్తున్న వర్మ.. ప్రస్తుతం తన సినిమా టీజర్ రేపు విడుదలవుతుందని చెప్పేందుకు కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

leave a reply