‘ భారతీయుడు 2’ తన చివరి సినిమాగా చెప్పిన కమల్ .

కమల్ తన రాజకీయ జీవితానికి తగిన విధంగా ఈ కథ ఉండబోతున్నట్లు వివరించారు.

కోలీవుడ్ :శంకర్  దర్శకత్వంలో వచ్చిన  భారతీయుడు  అప్పట్లో  సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో కమలహాసన్ ద్విపాత్రాభినయంలో నటించి  ప్రేక్షకులను  అలరించాడు. ఇపుడు కూడా  అదే శంకర్ మరియు  కమలహాసన్  కంబినేషన్ లో  ‘ భారతీయుడు 2’ ఈ నెల 14 నుంచి మొదలవుతుంది. ఈ చిత్రం తర్వాత కమల్ పూర్తిగా రాజకీయాలలోకి  వెళ్లిపోవాలని ఇకపై నటించనని చెప్పుకొచ్చారు . అందువల్లే ఈ సినిమా మరింత ప్రతిష్టాత్మకంగా  లైకా సంస్థ నిర్మిస్తోంది . శంకర్‌ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం.

కమల్ తన రాజకీయ  జీవితానికి   తగిన విధంగా  ఈ  కథ  ఉండబోతున్నట్లు వివరించారు.   ఇప్పటికే పార్టీని  ప్రకటించిన కమల్ హాసన్ రాబోయే   ఎన్నికల్లో అభ్యర్థులను ఎన్నుకొనే   ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే  ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ  చేసి  గెలిచి  తన  జీవితం  ప్రజలకు  అంకితం  చేయాలన్నది  కమల్ కోరిక. అందుకే ఇప్పటి నుండే పూర్తి రాజకీయాల్లోకి వెళ్లాలని కమల్ భావిస్తున్నాడు. అందుకు సినిమాల్లో ఉండటం  వల్ల   సాధ్యం కాకపోవచ్చని  ‘ భారతీయుడు 2’  చిత్రం తర్వాత  సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలలో  పూర్తిగా  నిమగ్నం  అవ్వాలని  నిర్ణయించుకున్నట్లుగా కమల్ ఒక ప్రకటనలో తెలియజేశాడు. డిసెంబర్ 14న సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. కాజల్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో అంటే తమిళనాడు ఎన్నికల ముందు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

leave a reply