16 మంది…అమ్మాయిలతో…

విజయ్ కి లాస్ట్ ఇయర్ బాగా కలిసివచ్చింది. 2018 లో విడుదలైన ‘సర్కార్’ సినిమాతో విజయ్ మరో  సంచలన విజయాన్ని అందుకున్నాడు. తన తరువాత చిత్రం దర్శకుడు అట్లీ కుమార్ తో ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లదానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.  ఈ  చిత్రానికి సంబంధించి  కథానాయిక పాత్రకి గాను నయనతారను ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈసినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

అయితే ఏ చిత్రానికి గాను 16 మంది అమ్మాయిలు కలిగిన టీమ్ కి విజయ్ కోచ్ గా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఇందుకోసం 16 మంది కొత్త అమ్మాయిలైతే బాగుంటుందనే  ఆలోచనలో దర్శకుడు అట్లీ కుమార్ వున్నాడని సమాచారం. ఆ అమ్మాయిల పాత్రలకి సంబంధించిన కొన్ని ఆడిషన్స్ కూడా మొదలైనట్లు సమాచారం. అయితే ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన ‘మెర్సల్’ [తెలుగులో అదిరింది] సినిమా  విజయ్  అట్లీ కుమార్ కాంబినేషన్లో  భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమతొ ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకోన్నాయి.

leave a reply