జవాన్లకు సహాయమందించిన విజయ్‌ దేవరకొండ

Hop in for a free ride with

పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అమర జవాన్ల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ దాతృత్వం చాటుకున్నారు. జవాన్ల కుటుంబాల కోసం ‘భారత్‌ కే వీర్‌’ కింద ఆర్థిక సాయం అందించారు.

 ‘‘వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద సపోర్ట్‌ని క్రియేట్ చేద్దాం’’ అని ట్వీట్ చేసి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. దీనిని చూసిన నెటిజన్లు మన సైనికులకు ఎలాంటి సహకారం అందించాలో తెలియజేసినందుకు థ్యాంక్స్ చెప్తే.. మరికొందరు విజయ్ బాటలోనే సహకారం అందించామంటూ సర్టిఫికెట్లు పోస్ట్ చేశారు.

leave a reply