బాపినీడు ఇక మనకు లేరు

ప్రముఖ దర్శకుడు, నిర్మాత బాపినీడు ఇక మనకు లేరు. అనారోగ్య కారణంగా ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమలో బాపినీడు చాలా సుపరిచితమైన వ్యక్తి. 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరులో ఆయన జన్మించారు. మొత్తం ఆయన 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో ఆయన ఎక్కువగా చిరంజీవితో తీసినవే. ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఆ పేరుతోనే పలు రచనలు కూడా ఆయన చేశారు. విజయ పేపర్‌లో కూడా ఆయన పనిచేశారు.

బాపినీడు మృతి పట్ల సీఎం చంద్రబాబు, కేసీఆర్‌లు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే.. పలువురు నటులు కే విశ్వనాథ్‌, చిరంజీవి, మోహన్‌ బాబు, మురళీ మోహన్‌, శివాజీ రాజా, పరుచూరి గోపాలక్రిష్ణ, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్‌, జెమినీ కిరణ్‌ పలువురు ఆయన మృతికి నివాళులర్పించారు. విజయ బాపినీడు అంతక్రియలు గురువారం హైదరాబాద్ మహా ప్రస్థానంలో నిర్వహిస్తారు. అమెరికాలో ఉన్న ఆయన పెద్ద కుమార్తె రావడానికి సమయం పడుతున్న కారణంగా అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

leave a reply