మీపై పగ తీర్చుకుంటా- షారుక్‌

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌పై పగ తీర్చుకుంటానని సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ అంటున్నారు. ‘బద్లా’ సినిమా పోస్టర్‌ను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేసి, ‘అమితాబ్‌జీ.. మీపై పగ తీర్చుకోవడానికి వస్తున్నా.. సిద్ధంగా ఉండండి’ అని సరదగా ట్వీట్‌ చేశారు షారుక్‌. ఈ ట్వీట్‌పై అమితాబ్‌ స్పందిస్తూ..’షారుక్‌ భాయ్‌.. పగ తీర్చుకునే సమయం దాటిపోయింది. ఇప్పుడు అందరికీ పగను పంచాల్సిన టైం వచ్చింది’ అని అమితాబ్‌ రీ ట్వీట్‌ చేశారు. వీరిద్దరి ఛాటింగ్‌ చూసిన హీరోయిన్‌ తాప్సీ ‘షారుక్‌ జీ.. పగ తీర్చుకుంటానని మీరు ఇలా అనడం తప్పు.. ఇప్పుడు మీకేమైనా కావాలనిపిస్తే పోస్టర్‌ నుంచి తీసుకోండి’ అని తాప్సీ ట్వీట్‌ చేసింది. అమితాబ్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బద్లా’. ఈ సినిమాకి సుజాయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించారు. షారుక్‌ ఖాన్‌ నిర్మాత బాధ్యతలు వ్యవహరించారు. ఈ సినిమా మార్చి8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

leave a reply